Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా..! 13 d ago
మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతుంది. జల్పల్లిలో మంచు మనోజ్ నివాసానికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. మనోజ్ ఇంటి సీసీ పుటేజ్ హార్డ్డిస్క్ విజయ్ తీసుకెళ్లారు. మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే విష్ణు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారని, మంచు విష్ణు స్వయనా వివరాలను అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దని విష్ణు టీమ్ ప్రకటించింది.